: బాలకృష్ణ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని దేశం ఎమ్మెల్యే...క్లాసు పీకిన బాలయ్య!


తన అభిమాని, మాజీ కార్పొరేటర్ భానుప్రకాశ్ కు హైదర్ నగర్ టీడీపీ కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి హీరో బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని తెలుస్తోంది. ఆపై పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే సెల్ నుంచి ఫోన్ చేయగా, గాంధీ లిఫ్ట్ చేశారని, దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య, తనదైన శైలిలో క్లాస్ పీకారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు భానుప్రకాశ్ సరిగ్గా సహకరించలేదని, నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలతోనూ ఆయనకు సరిగ్గా పడటం లేదని సర్దిచెప్పేందుకు గాంధీ ప్రయత్నించగా, బాలయ్య పట్టించుకోకుండా, టికెట్ ఇవ్వాలని ఆదేశించారట!

  • Loading...

More Telugu News