: యూనివర్సిటీలో సంఘటనలకు వీసీదే బాధ్యత: చుక్కా రామయ్య


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదయినా యూనివర్సిటీలో జరిగే సంఘటనలకు ఆ యూనివర్సిటీ ఉపకులపతి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే వేముల రోహిత్ ఆత్మహత్య విషయంలో హెచ్ సీయూ వీసీ అప్పారావు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సమగ్రమైన దర్యాప్తు, సరైన విచారణ లేకుండా రోహిత్ ను సస్పెండ్ చేశారని విద్యార్థులు చెబుతున్నారని, అలా జరిగి ఉంటే బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News