: విద్యార్థి సంఘాలన్నీ ఏకం కావాలి: డిగ్గీ రాజా
యూనివర్సిటీల్లో మతతత్వ శక్తులను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలన్నీ ఏకం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, విద్యార్థి సంఘాలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ లను ఆర్ఎస్ఎస్-బీజేపీలు నియమిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తద్వారా చదువును ప్రోత్సహించాల్సిన యూనివర్సిటీలు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు.