: రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో గవర్నర్ పర్యటన
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ రేపు తెలంగాణలోని మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. గజ్వేల్, జనగాం, ఆలేరు నియోజకవర్గాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించి, పనుల వివరాలను అడిగి తెలుసుకుంటారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో గవర్నర్ వెంట పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెళ్లనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.