: రోహిత్ ఆత్మహత్య రాష్ట్రానికి చెందిన వ్యవహారం: స్మృతి ఇరానీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలో స్పందించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశం పూర్తిగా రాష్ట్రానికి (తెలంగాణ) చెందిన వ్యవహారమని స్పష్టం చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక వచ్చిన తరువాతే తాను మాట్లాడతానని చెప్పారు. అప్పటివరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని స్మృతి తెలిపారు.