: టీసీఎస్, విప్రో దారిలోనే హెచ్సీఎల్!


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మినహా, మిగతా దిగ్గజ ఐటీ సంస్థల ఫలితాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ సైతం నామమాత్రపు లాభాల వృద్ధిని నమోదు చేసింది. అక్టోబరు - డిసెంబరు మధ్య కాలంలో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 1,920 కోట్లకు చేరిందని ప్రకటన వెలువడగా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ ఉదయం మార్కెట్లో సంస్థ ఈక్విటీ వాటా విలువ 1 శాతం దిగజారింది. కాగా, "21వ శతాబ్దపు వృద్ధిపై కన్నేసిన సంస్థ డిజిటల్ మాధ్యమ అవధులను దాటి ముందుకు సాగనుంది. తదుపరి తరం ఐటీఓ సేవల విస్తరణపై కన్నేశాం. ఈ ఫలితాలు సంస్థకు సంతృప్తికరం" అని హెచ్సీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంత్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ మూడు నెలల కాలంలో సంస్థ ఆదాయం రూ. 10,341 కోట్లకు చేరింది.

  • Loading...

More Telugu News