: 143 మంది టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు


జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పార్టీ గ్రేటర్ అభ్యర్థులకు ఇవాళ టీఆర్ఎస్ బీ-ఫారాలు ఇచ్చింది. 150 డివిజన్లలోనూ పోటీ చేస్తున్న తమ అభ్యర్థులలో 143 మందికి బీ-ఫారాలు అందజేసింది. నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 21తో ముగియనుంది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 2న ఎన్నికలు జరుగనుండగా, 5న లెక్కింపు జరుగుతుంది.

  • Loading...

More Telugu News