: పాకిస్థాన్ లో యూట్యూబ్ పై నిషేధం ఎత్తివేత


సోషల్ నెట్వర్కింగ్ వీడియో వెబ్ సైట్ యూ ట్యూబ్ పై పాకిస్థాన్ లో ఊరట లభించింది. ఆ దేశ టెలికాం నియంత్రణ సంస్థ దానిపై నిషేధాన్ని ఎత్తివేసింది. నిషేధం తొలగించడాన్ని పాక్ యువత స్వాగతించింది. 2012లో దైవదూషణ చేస్తున్న ఓ వీడియోను యూ ట్యూబ్ లో పెట్టారు. దాంతో ఇస్లామిక్ దేశాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో పాక్ టెలికాం సంస్థ యూట్యూబ్ పై నిషేధం విధించింది. నిషేధంపై గూగుల్ యాజమాన్యం పాక్ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో యూట్యూబ్ ను అనుమతిస్తూ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నుంచి మతానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి వీడియోలను ఉంచబోమని గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్, నేపాల్, శ్రీలంకల్లో యూట్యూబ్ స్థానిక వెర్షన్లను కూడా తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News