: అనుకుంటే సరిపోదు, అమలు చేయాలిగా!: కేంద్రంపై రఘురాం రాజన్


ఇండియాలో సంస్కరణల అమలు వ్యవస్థకు అతిపెద్ద సవాలుగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. కేవలం సంస్కరణలను అమలు చేయాలని భావిస్తే సరిపోదని వాటిని అమలు చేసినప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతామని ఆయన అన్నారు. "ఇండియాలో హామీలకు వాటి అమలుకు మధ్య వ్యత్యాసం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. హామీల అమలు జరుగుతుంటే, వచ్చే 10 సంవత్సరాల్లో భారత్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు" అని అన్నారు. ఆస్ట్రేలియా కేంద్రంగా వెలువడుతున్న సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్థిక విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఆస్ట్రేలియా ఉత్పత్తి కమిషన్ ఎంతో కృషి చేస్తుందని రాజన్ కొనియాడారు. ఇరు దేశాల ఎకానమీ ఎంతో పెద్దదది, ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయని అన్నారు. ఏఎన్ జడ్, టెల్ స్ట్రా వంటి ఇక్కడి కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు. ప్రపంచాన్ని ముందుకు నడిపే నాయకత్వ సంస్థల్లో ఐఎంఎఫ్ ప్రధాన భూమికను పోషించనుందని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News