: ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుత 'ఏపీ'కి 2017 జూన్ 2లోగా వెళితే స్థానికులే!


ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడి ఆపై రాష్ట్ర విభజన అనంతరం సొంత ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారికి శుభవార్త. రాష్ట్రం విడిపోయిన జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు నవ్యాంధ్రకు వెళ్లే కుటుంబాలన్నింటికీ స్థానికతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఫైల్ ను పరిశీలించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, తదుపరి పరిశీలన కోసం న్యాయశాఖకు పంపింది. ఇక న్యాయశాఖ నుంచి ఆ ఫైల్ హోం శాఖకు తిరిగి వస్తే, రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వులను బట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం నుంచైనా, ప్రస్తుత ఏపీలోని ఎక్కడికి వెళ్లినా స్థానికత వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News