: పఠాన్ కోట్ కేసు అప్ డేట్స్... నేడు సల్వీందర్ కు లై డిటెక్టర్ టెస్టు!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడికి సంబంధించిన దర్యాప్తులో పాకిస్థాన్ నుంచి ఎలాంటి సహకారం అందకున్నా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన పని తాను చేసుకుపోతోంది. మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులకు రెడ్ కార్పెట్ మార్గం పరిచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ కేడర్ సీనియర్ పోలీసు అధికారి, గురుదాస్ పూర్ జిల్లా మాజీ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు సత్య శోధన పరీక్షలు నిర్వహించేందుకు ఎన్ఐఏ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు సల్వీందర్ ను విచారించగా, ఒక్కోసారి ఒక్కో రకమైన సమాధానం చెప్పిన ఆయన దర్యాప్తు అధికారుల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో లై డిటెక్టర్ టెస్టులు చేస్తేనే కాని అసలు విషయం వెలుగులోకి రాదన్న అభిప్రాయానికి వచ్చిన ఎన్ఐఏ నేడు ఆయనకు సదరు పరీక్షలు నిర్వహించనుంది.