: 10 నిమిషాల పాటు మూగబోయిన ట్విట్టర్... వెనువెంటనే సరిచేసిన సిబ్బంది


సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అగ్రభాగాన ఉన్న ట్విట్టర్ నిన్న ఉన్నట్టుండి మూగబోయింది. సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో నెటిజన్లు ప్రధానంగా భారతీయ నెట్ యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. అయితే సమస్యను వెనువెంటనే గుర్తించిన ట్విట్టర్ సిబ్బంది దానిని పరిష్కరించారు. ఓ పది నిమిషాల (భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 7.53 గంటల నుంచి 8.03 గంటల వరకు) తర్వాత ట్విట్టర్ మళ్లీ యథాతథంగా పనిచేసింది. సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని అంగీకరించిన ట్విట్టర్ యాజమాన్యం దానిని సరిచేశామని ప్రకటించింది. అయితే ఆ కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News