: మసూద్ అరెస్ట్ బూటకమే!... గృహ నిర్బంధం కూడా అబద్ధమే!: నిఘా వర్గాలు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడికి సూత్రధారిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేశామని తొలుత, ఆ తర్వాత గృహ నిర్బంధం చేశామని పాకిస్థాన్ చెప్పిన విషయాలన్నీ ఒట్టి బూటకమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మసూద్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ దర్యాప్తు అధికారులు అబద్ధాలు చెప్పారని కూడా ఆ వర్గాలు మండిపడుతున్నాయి. భారత్ ను తప్పుదోవ పట్టించే దిశగానే మసూద్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ వ్యవహరించిందని కూడా చెబుతున్నారు. ఈ మేరకు నిఘా వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. పఠాన్ కోట్ దాడిపై విచారణ చేపట్టిన పాక్ అధికారులు కేవలం మసూద్ కు చెందిన ఓ ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారని, వారిని కూడా పఠాన్ కోట్ కేసులో కాకుండా ఇతర కేసుల్లో ఆరోపణలపైనే అదుపులోకి తీసుకున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News