: బాలయ్య అభిమానుల కోరికను త్వరలోనే తీరుస్తాము: దర్శకుడు శ్రీవాస్
సంక్రాంతి కానుకగా శ్రీవాస్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ, డిక్టేటర్ చిత్రం విజయవంతమైందని, ఈ చిత్రాన్ని అభిమానులు ఒక రేంజ్ లో ఆదరిస్తున్నారని అన్నారు. బాలకృష్ణను కలవాలని, చూడాలని కోరుకుంటున్న ఆయన అభిమానుల సంఖ్య ఈ చిత్రం తర్వాత మరింత పెరిగిందన్నారు. బాలయ్య బాబు అభిమానుల కోరికను త్వరలోనే ఒక కార్యక్రమం ద్వారా తీరుస్తామని శ్రీవాస్ అన్నారు.