: మూఢనమ్మకం.. బాలుడికి శునకంతో పెళ్లి!


మూఢ నమ్మకాల్లో భాగంగా బాలుడికి శునకంతో పెళ్లి చేసిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సరైకేలా ఖర్సావన్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ముఖేశ్ అనే బాలుడికి నోటి పైవరుసలో ఒక దంతం వచ్చింది. ఈవిధంగా రావడం శుభసూచకం కాదని భావించిన బాలుడి కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక శునకాన్ని వధువులా తయారు చేసి ముఖేశ్ తో దానికి పెళ్లి చేశారు. తద్వారా దుష్టశక్తులు బాలుడి దరి చేరవన్నది వారి నమ్మకం. ఈ తరహా పెళ్లిళ్లను ప్రతి ఏటా అక్కడ జనవరి 15-21 తేదీల్లోపు నిర్వహిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News