: ఏపీలో సమ్మె విరమించిన వీఆర్ఏలు!
పే స్కేల్ అమలు చేయాలంటూ 78 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీ వీఆర్ఏలు సమ్మె విరమించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైన తర్వాత పే స్కేల్ అమలు చేస్తానని, వారి డిమాండ్లు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు. రేపటి నుంచి విధులకు వీఆర్ఏలు హాజరుకానున్నట్లు సమాచారం.