: ఎన్టీఆర్ ఘాట్ ను ఎందుకు అలంకరించలేదు? తప్పు కేసీఆర్ దా? అధికారులదా?: రేవంత్ రెడ్డి


మహానేత నందమూరి తారకరామారావు వర్ధంతిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి వెలుగునిచ్చిన ఒక మహానేత వర్ధంతిని నిర్లక్ష్యం చేయడమంటే వారిని అవమానించడమేనని అన్నారు. దీనిని తీవ్రమైన పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఇటువంటి వ్యవహారశైలి ఎంతమాత్రం మంచిది కాదని, తెలంగాణ సర్కార్ కు తమ నిరసనను తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనుకుంటే ఇంకో రకంగా కూడా చెప్పగల్గుతామని, కానీ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అలాంటి పనులు చేయడం సమంజసంగా ఉండదని తాము ఊరుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే ఎన్టీఆర్ ఘాట్ ను అలంకరించకపోతే కనుక ఆయనే క్షమాపణలు చెప్పాలని.. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యమైతే వారిని వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News