: ఈ పదవి ఎన్ఆర్ఐలకిచ్చిన సంక్రాంతి కానుక: కోమటి జయరాం


ఈ పదవి తనకిచ్చింది కాదని, ఎన్ఆర్ఐలకిచ్చిన సంక్రాంతి కానుక అని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ఎన్ఆర్ఐ కోమటి జయరాం అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత లోకేష్ కు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా తాను అమెరికాలో ఉన్నానని, ఎన్ ఆర్ఐ కమ్యూనిటీలో చాలా ఉత్సాహంగా సేవలందిస్తున్నానని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు, లోకేష్ లు తనకు ఈ పదవిని ఇవ్వడం జరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎన్ఆర్ఐల ద్వారా ఏపీకి మేలు జరిగేలా తన వంతు కృషి చేస్తానని కోమటి జయరాం చెప్పారు.

  • Loading...

More Telugu News