: యువరాజ్ రికార్డును సమం చేసిన క్రిస్ గేల్


టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ నెలకొల్పిన వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ సమం చేశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ టీట్వంటీ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడుతున్న గేల్ కేవలం 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా వచ్చిన గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ ఆరంభించాడు. తొలి ఓవర్లోనే నాలుగు సిక్సర్లు సాధించిన గేల్ ఆ వూపులోనే మరో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో కేవలం 12 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న గేల్ 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో 170 పరుగులు చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో 143 పరుగులు చేసిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ ఓటమి పాలైంది.

  • Loading...

More Telugu News