: ఆర్ఎస్ఎస్ సమావేశ స్థలం వద్ద కాల్పులు


పంజాబ్ లోని టూధియానాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యులు సమావేశమైన ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతుకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీనిపై లూధియానా పోలీస్ కమిషనర్ నరేందర్ భార్గవ్ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిత్యం సమావేశమయ్యే షహీదీ పార్కులో ద్విచక్రవాహనంపై ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారని, సంఘటనా స్థలంలో 0.35 ఎంఎం బోరింగ్ పిస్టల్ దొరికిందని ఆయన తెలిపారు. పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న అనంతరం దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News