: పాన్ మసాలా యాడ్స్ లో నటించొద్దు... బాలీవుడ్ కు 'ఆప్' పిలుపు
కేన్సర్ కు కారణమవుతున్న పాన్ మసాలా యాడ్స్ లో బాలీవుడ్ నటులు నటించవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్ హీరోలైన షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, గోవిందా, అజయ్ దేవగణ్, సన్నీ లియోన్ వంటి నటులు పాన్ మసాలా యాడ్స్ లో నటించవద్దని ఆప్ సూచించింది. యువతకు ఆదర్శంగా ఉండే ఇలాంటి నటులు పాన్ మసాలా యాడ్స్ లో నటించడం వల్ల వారి అభిమానులు పెడదారి పట్టే అవకాశం ఉందని వారికి లేఖలు రాసింది. బాలీవుడ్ నటులంతా పొగాకు వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆప్ సూచించింది.