: బంతి అనుకుని బాంబును పట్టుకున్న బాలుడు!
బంతి అనుకుని బాంబును పట్టుకోవడంతో బాలుడి చెయ్యి తెగిపడిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. మైదుకూరు మండలంలోని ఆదిరెడ్డి పల్లెలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. ప్రసాద్ అనే బాలుడు అక్కడ ఉన్న ఒక బాంబును బంతిగా భావించి చేతిలోకి తీసుకున్న సందర్భంలో అది పేలింది. దీంతో బాలుడి చెయ్యి తెగిపడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రకాశం జిల్లాలోని బచ్చువారిపాలెం గ్రామంలో నిన్న రెండు నాటు బాంబులు పేలాయి. బాంబులు పేలిన ప్రాంతంలో అక్కడ ఉన్న ఒక తెల్లని వస్తువును చేతిలోకి తీసుకుని పరిశీలిస్తుండగా అది పేలడంతో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.