: చివరి దశలో ఉన్న 9 గుర్రాలను దత్తత తీసుకున్న బాలీవుడ్ నటుడు


అవసాన దశలో ఉన్న 9 గుర్రాలను బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా దత్తత తీసుకున్నాడు. ఒకప్పుడు రేసు గుర్రాలుగా ఓ వెలుగు వెలిగిన పదుల కొద్దీ గుర్రాలు వయసు మళ్లడంతో ఇప్పుడు రేసుకు పనికిరాకుండా పోయాయి. దీంతో వాటిని భారంగా భావించిన వాటి యజమానులు వాటి ఆలనాపాలన పట్టించుకోవడం మానేశారు. దీంతో అవి అనారోగ్యం బారినపడి కోలుకోలేక మృతి చెందుతున్నాయి. దీంతో ఫ్రెండికోస్ అనే స్వచ్ఛంద సంస్థ వాటిని ఢిల్లీ శివార్లలోని ఫాం హౌస్ కు తరలించి బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో వాటిల్లో కొన్ని అనారోగ్యానికి గురయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న రణదీప్ హుడా వాటిల్లో 9 గుర్రాలను దత్తత తీసుకున్నాడు. ఈ సందర్భంగా అవి కూడా మనుషుల్లాగే గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తుంటాయని, తమను తాము నిరూపించుకునేందుకు తాపత్రయ పడతాయని తెలిపాడు. కాగా, ఢిల్లీ శివార్లలోని గుర్ గావ్ లోని ఓ ఫాం హౌస్ లో రణదీప్ హుడా 40 రకాల గుర్రాలతో పోలో గేమ్ నిర్వహిస్తుంటాడు.

  • Loading...

More Telugu News