: సినీ నటి పావలా శ్యామలకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం!


సినీ నటి పావలా శ్యామలకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం చేశారు. ఆమె ఆర్థిక స్థితిగతులపై ఇటీవల ఒక పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. పావలా శ్యామలను ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ను ఆమె కలిసింది. ఆమె వెంట కూతురు మాధవి కూడా ఉంది. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.20 వేలు శ్యామలకు అందజేశారు. ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఇబ్బంది పడుతున్న శ్యామలకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున ఆమెకు ప్రతి నెల రూ.10 వేలు చొప్పున పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News