: స్మృతీ ఇరానీ నివాసం ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థులు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ (28) ఆత్మహత్య ప్రకంపనలు ఢిల్లీని తాకాయి. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ కు మద్దతుగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు స్పందనగా, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ కారణంగానే రోహిత్ పై సస్పెన్షన్ వేటు వేశారని, ఆ నేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు స్మృతీ ఇరానీ నివాసం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.