: గోవాలో తమ టూరిస్టు మరణంపై సమగ్ర విచారణ కోరిన అమెరికా!


తమ దేశస్తుడు ఒకరు పరాయి దేశంలో మరణిస్తే ఆ సంఘటనను అమెరికా ఎంత సీరియస్ గా తీసుకుంటుందో తెలిపే సంఘటన ఇది. ఇటీవల గోవాలో అమెరికన్ టూరిస్ట్ హోల్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యవహారాన్ని యూఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. వారం రోజుల క్రితం గోవాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన హోల్ట్ మృతికి సంబంధించి సంగర్ దర్యాప్తు చేసి, వివరాలను తమకు తెలియజేయాలంటూ అమెరికా అధికారులు భారత్ అధికారులను కోరారు. యూఎస్ లోని హోల్ట్ కుటుంబసభ్యులను అమెరికా అధికారులు సంప్రదించినట్లు కాన్సులర్ ఇన్ ఫర్మేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పానాజీ ప్రాంతంలో ఒక వ్యక్తి బురదలో కూరుకుపోయి ఉండటాన్ని గమనించిన అక్కడి పోలీసులు అతన్ని వెంటనే బయటకు తీశారు. అతని పాస్ పోర్టు ఆధారంగా మృతుడి పేరు హోల్ట్ అని, అమెరికా దేశస్తుడని భారత్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. హోల్ట్ మృతిని కేవలం ఒక యాక్సిడెంట్ అంటూ గోవా ముఖ్యమంత్రి లక్ష్మికాంత్ పర్సేకర్ కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News