: జూనియర్ ఎన్టీఆర్ బావమరిదీ బాగున్నాడండోయ్!
జూనియర్ ఎన్టీఆర్ సతీమణిగా, అభయ్ రామ్ ను అద్భుత బహుమతిగా ఆయన జీవితంలోకి తీసుకువచ్చిన ప్రణతి గురించి అందరికీ తెలిసిందే. అనునిత్యమూ తన కుమారుడితో కలసి తీయించుకున్న చిత్రాలను ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మనకు అందిస్తున్నాడు. అభయ్ ఎలా వుంటాడో మనకు తెలుసు. ఇదే సమయంలో ప్రణతి కుటుంబ సభ్యుల గురించి...? అభిమానులకు, తెలుగు ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలోనే ప్రణతి తన సోదరుడితో కలసి తీయించుకున్న ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది. ప్రణతి తన సోదరుడు, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నితిన్ తో ఓ ఫోటో దిగి ఫేస్ బుక్ లో షేర్ చేయగా, "అరే, ఎన్టీఆర్ బావమరిది బాగున్నాడే" అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. ఏమో... నితిన్ తెరంగేట్రానికి సమయం వచ్చిందేమో?!... ఆ చిత్రాన్ని మీరూ చూడండి.