: ఎన్టీఆర్ సమాధిని చూసి, కన్నీరుపెట్టిన లక్ష్మీపార్వతి!
నందమూరి తారకరామారావు సమాధికి సరైన అలంకరణ లేకపోవడంపై లక్ష్మీపార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. నేడు ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఆయన సమాధిని పూలతో అలంకరించాలని రెండు తెలుగు ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన సమాధిని చూస్తే కడుపుతరుక్కుపోయిందని, అప్పటికప్పుడు హడావుడిగా కొన్ని పూలతో అలంకరించారని ఆమె పేర్కొంది.