: బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏబీవీపీ గూండాలు రెచ్చిపోతున్నారు: హెచ్ సీయూ విద్యార్థులు


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏబీవీపీ గూండాలు రెచ్చిపోతున్నారని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ అప్పారావు చీఫ్ వార్డెన్ గా ఉన్ననాటి నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. వీసీని అరెస్టు చెయాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఇంటర్నల్ మెకానిజం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఎలా కల్పించుకున్నారని వారు ప్రశ్నించారు. స్టూడెంట్స్ అవినీతి, అరాచకాలను సహించరని, అందులో భాగంగా పలు సందర్భాల్లో అధికారుల నియంతృత్వాన్ని ప్రశ్నించారని వారు పేర్కొన్నారు. కేవలం ఏబీవీపీ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ ను రక్షించడంలో భాగంగా యూనివర్సిటీ అధికారులు దళితులను వేధింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. సుశీల్ కుమార్ అరాచకాలకు ఎంత మంది విద్యార్థులు బలికావాలని వారు ప్రశ్నించారు. గతంలో ఇదే యూనివర్సిటీలో ఆరుగురు విద్యార్థులు ఇలాగే తనువు చాలించారని, వారెవరికీ న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. దళితులు, బీసీలను అణగదొక్కాలనే లక్ష్యంతో ఏబీవీపీ పని చేస్తోందని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News