: మతోన్మాది దూషించడంతో... చేయి నరుక్కున్న బాలుడు!


మతోన్మాదం హింసకు పురిగొల్పుతోంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ గ్రామంలో షబ్బీర్ అహ్మద్ అనే ఇమాం ప్రసంగం ఇస్తున్నాడు. ఈ సందర్భంగా 'మీలో ఎవరైనా మహ్మద్ ప్రవక్తను ప్రేమించని వారు ఉన్నారా?' అని ఇమాం ప్రజలను అడిగాడు. ఈ ప్రశ్న సరిగా వినని ఓ 15 ఏళ్ల బాలుడు చేయిపైకెత్తాడు. అంతే, ఆగ్రహించిన ఇమాం తక్షణం ఆ బాలుడ్ని బయటకి వెళ్లమని ఆదేశిస్తూ, ఆ బాలుడు దైవ దూషణ చేశాడని మండిపడ్డాడు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లి ఎత్తిన చేయిని నరుక్కున్నాడు. దీంతో ఇమాం షబ్బీర్ అహ్మద్ ఆ బాలుడ్ని హింసకు ప్రేరేపించాడని పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి చర్యను అభినందించిన అతని తండ్రి, ఇమాంను అరెస్టు చేయవద్దని పోలీసులను కోరాడు. నిరక్షరాస్యులైన ఇమాంలు ప్రసంగించడాన్ని తాము అనుమతించమని పేర్కొంటూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News