: అద్దెకు హెలికాప్టర్ కావాలా? ఉబెర్ క్యాబ్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు


ప్రముఖ అద్దె కార్ల బుకింగ్ యాప్ ఉబెర్ క్యాబ్స్ త్వరలో సరికొత్త సౌకర్యానికి నాంది పలకనుంది. ఇంత వరకు అద్దెకు కార్లను సరఫరా చేసిన ఉబెర్ క్యాబ్స్ సంస్థ ఇకపై వినియోగదారులకు హెలికాప్టర్లు కూడా సరఫరా చేయనుంది. ఈ మేరకు అమెరికాలో ప్రయోగాత్మకంగా సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. అమెరికాలోని ఉటా పార్క్ సిటీలో ఈ నెల 21 నుంచి జరగనున్న సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తొలిసారి హెలికాప్టర్ సర్వీసులు అందజేయనుంది. యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ బస్ ఉబెర్ కు హెలికాప్టర్లు సరఫరా చేయనుంది. డిమాండ్ ను అనుసరించి హెచ్ 125, హెచ్ 130 హెలికాప్టర్లను ఔత్సాహికుల కోసం సిద్ధంగా ఉంచింది.

  • Loading...

More Telugu News