: 30 సెకన్లలో కోర్టులోకి వెళ్లి బయటకు వచ్చిన కరుణానిధి


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తరఫున దాఖలైన పరువు నష్టం కేసులో ఈ ఉదయం మద్రాసు హైకోర్టు సముదాయంలోని సెషన్స్ కోర్టుకు హాజరైన డీఎంకే అధినేత కేవలం 30 సెకన్లు మాత్రమే కోర్టు హాలులో గడిపారు. 92 సంవత్సరాల కరుణానిధి తన అనుచరగణంతో కోర్టు హాల్లోకి వెళ్లగానే, కేసు బెంచ్ పైకి రావడం, వెంటనే విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగిపోయాయి. మరుక్షణం బయటకు వచ్చిన ఆయన, తప్పుడు కేసులను తనపై పెడుతున్నారని, చట్ట పరంగానే వీటిని ఎదుర్కొంటామని మీడియా ముందు చెప్పి వెళ్లిపోయారు. కాగా, ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కరుణానిధి పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు అంగీకరించిందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.

  • Loading...

More Telugu News