: దత్తాత్రేయ దిగజారారు...విద్యార్థుల రాజకీయాల్లో తలదూర్చారు: ఎంపీ కవిత


కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దిగజారి విద్యార్థుల రాజకీయాల్లో తలదూర్చారని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ (28) ఆత్మహత్యపై ఆమె మాట్లాడుతూ, ఈ విషయం చాలా కాలంగా తమ ముందు ఉందని, అయితే విద్యార్థుల వివాదాల్లో రాజకీయ నాయకులు తలదూర్చడం సరికాదని భావించి మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బీజేపీ విద్యార్థి విభాగానికి అనుకూలంగా పని చేసి, దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా వీసీపై ఒత్తిడి తెచ్చేలా లేఖ రాశారని, ఆ లేఖే ఇప్పుడు ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా అకారణంగా విధించిన సస్పెన్షన్ ను మిగిలిన నలుగురు విద్యార్థులపై ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ నేతల తీరు సరికాదని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News