: కేసీఆర్ తో బాలకృష్ణ భేటీ


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో హిందుపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఈ ఉదయం హైదరాబాదులో భేటీ అయ్యారు. తమ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న నందమూరి బసవతారకం క్యాన్సర్ అసుపత్రి చేస్తున్న సేవలను వివరించేందుకే కేసీఆర్ తో బాలయ్య సమావేశమైనట్టు తెలుస్తోంది. రోగుల సౌకర్యాల కోసం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలను చేపట్టామని, బీఆర్ఎస్ కింద వాటిని క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా బాలకృష్ణ కోరగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రజల అవసరాలను తీర్చే సంస్థలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కేసీఆర్ సూచించారు. తన తాజా చిత్రం 'డిక్టేటర్'ను వీక్షించాలని బాలకృష్ణ కోరగా, అందుకు కేసీఆర్ అంగీకరించారట.

  • Loading...

More Telugu News