: తెలుగువారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే: పురంధేశ్వరి


తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్నవంతెన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అంటూ ఆయన నిరంతరం పేదల కోసమే పరితపించేవారని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News