: 'గాలి' బెయిల్ స్కాం నిందితుడు, మాజీ జడ్జి ప్రభాకర్ రావు ఆత్మహత్య
బళ్లారి ప్రాంతంలో అక్రమ గనుల కుంభకోణం కేసులో గాలి జనార్దనరెడ్డికి బెయిల్ ఇప్పించే విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించి, కోట్లాది రూపాయల డీల్ కుదుర్చుకున్నాడన్న ఆరోపణలతో సస్పెండయిన మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు ఆత్మహత్య చేసుకున్నారు. జనార్దనరెడ్డి బెయిల్ కేసు సమయంలో ప్రభాకర్ రావు మధ్యవర్తిగా వ్యవహరించి, లంచం తీసుకుని సీబీఐకి చిక్కిన సంగతి విదితమే. ఆపై అరెస్టయి, ఉద్యోగం నుంచి సస్పెండై కొద్దికాలం జైల్లో గడిపిన ఆయన, ఆపై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఈ స్కామ్ అప్పట్లో సంచలనం సృష్టించగా, ఆయనిప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఎన్నో కొత్త ప్రశ్నలకు కారణమైంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియాల్సివుంది.