: తాతకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్... తండ్రితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లిన వైనం
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్... తన తాతయ్య నందమూరి తారకరామారావుకు కొద్దిసేపటి క్రితం ఘన నివాళులర్పించాడు. తన తండ్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరితో కలిసి హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లాడు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు జూనియర్ ఘనంగా నివాళులర్పించాడు. తన తాతయ్య వర్ధంతి సందర్భంగా తన తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పేరిట ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తన అభిమానులకు ఎన్టీఆర్ పిలుపునిచ్చాడు.