: నేడు పి.ఎస్‌.ఎల్‌.వి- సి-31 రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్


అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ... తాజాగా సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ ను నింగిలోకి పంపనున్న ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ ప్రారంభించనుంది. రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తయి చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ను 48గంటల ముందు...నేటి ఉదయం 9.31గంటలకు ప్రారంభిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈనెల 20వ తేదీ ఉదయం 9.31 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

  • Loading...

More Telugu News