: కాకినాడ ఎంపీ తోట నర్సింహంకు తృటిలో తప్పిన ప్రమాదం


కాకినాడ ఎంపీ తోట నర్సింహం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విశాఖపట్టణం జిల్లా నుంచి ఎంపీ తోట నర్సింహం కాకినాడ వస్తుండగా వెంపాడు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ అప్రమత్తమై కారును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనలో ఎంపీకి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని సమాచారం అందింది.

  • Loading...

More Telugu News