: ఏం చేసుకుంటారో చేసుకోండి...ఆ ఇంటితో మాకు సంబంధం లేదు: పాక్ కు రిషికపూర్ స్పష్టీకరణ


పాకిస్థాన్ లోని పెషావర్ లోని బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ పూర్వీకుల చారిత్రక నివాసాన్ని దాని యజమానులు కూల్చివేశారు. దీంతో రంగప్రవేశం చేసిన ఖైబర్ ఫఖ్తూంక్ ప్రభుత్వాధికారులు స్థానిక కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురావడంతో దాని యజమానులు కూల్చేపనికి బ్రేక్ ఇచ్చారు. పృధ్వీరాజ్ కపూర్ అతని కుమారులు రాజ్ కపూర్, దిలీప్ కపూర్ ఆ హవేలీలోనే జన్మించారు. అనంతరం వారు ముంబై వచ్చి స్థిరపడిపోయారు. హవేలీ కూల్చివేతపై రాజ్ కపూర్ తనయుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రభుత్వం ఆ హవేలీని ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదని అన్నాడు. ఆ హవేలీతో తమకు ఎలాంటి అనుబంధం లేదని రిషీ కపూర్ స్పష్టం చేశాడు. తానేనాడూ ఆ హవేలీని చూసేందుకు కూడా వెళ్లలేదని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News