: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం: వెంకయ్యనాయుడు


వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, దేశ హితం దృష్ట్యా జీఎస్టీ బిల్లు ఆమోదం ఎంతో అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న సమస్యలకు గతంలోనే సమాధానం చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఫిబ్రవరి మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సీసీపీఏ సమావేశంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలను నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News