: గ్రేటర్ లో మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయి: కమిషనర్ నాగిరెడ్డి
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దనరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ తరపున మొత్తం 698 నామినేషన్లు, టీడీపీ నుంచి 506 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున 501 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వెల్లడించారు. బీజేపీ తరపున 308 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన వివరించారు. బీఎస్పీ నుంచి 82, సీపీఐ నుంచి 28, సీపీఎం నుంచి 29 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. 817 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు. అయితే బీఫారం ఇచ్చిన వారిని మాత్రమే అభ్యర్థులుగా గుర్తిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టే ప్రతి పైసాకు లెక్క చూపాలని ఆయన సూచించారు. బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేయకుండా ఏటీఎంలను వినియోగించాలని, ఆ రిసీట్ లను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆయన తెలిపారు.