: ట్వింకిల్ ను చూడకుండా ఉండలేను: అక్షయ్ కుమార్


'తమ వివాహం నాటి నుంచి ఇప్పటి వరకు ట్వింకిల్ ఖన్నాలో ఎలాంటి మార్పు లేద'ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్లో పాత ఫోటో పోస్టు చేసిన అక్షయ్ కుమార్, 'ఆమెలో అప్పటికి, ఇప్పటికి ఎలాంటి మార్పులేదని, ట్వింకిల్ ను చూడకుండా ఉండలేనని' పేర్కొన్నాడు. ట్వింకిల్ కూడా భర్తతో దిగిన ఫోటోను ట్విట్టర్ పేజ్ లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 'మీ భర్త మీకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఏమిచ్చాడు?' అని అభిమానులు ప్రశ్నించారు. 'ఈ ఫోటోలో కనిపిస్తున్నంత మధురమైన ఎన్నో క్షణాలను తనకు తన భర్త గిఫ్ట్ గా ఇచ్చాడ'ని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News