: టీమిండియాకి చుక్కలు చూపించిన మ్యాక్స్ వెల్...సిరీస్ ఆసీస్ వశం
గ్లెన్ మ్యాక్స్ వెల్ (96) టీమిండియాకి చుక్కలు చూపించాడు. మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్ వెల్ సాధికారకమైన ఆటతీరు ప్రదర్శించడంతో ఈ సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. వరుసగా మూడు వన్డేల్లో అద్భుతమైన ఆటతీరుతో ఆసీస్ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. మ్యాచ్ చేజిక్కించుకునేందుకు అందివచ్చిన చక్కని అవకాశాన్ని టీమిండియా ఆటగాళ్లు వినిగించుకోలేకపోయారు. దీంతో కోహ్లీ (117) చేసిన సెంచరీ వృథా అయింది. 296 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ సునాయాసంగా విజయం సాధించింది. టీమిండియా బౌలింగ్ విభాగంలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో మూడు విజయాలు సాధించిన ఆసీస్ సిరీస్ ను సొంతం చేసుకుంది.