: పని ప్రారంభించిన పారాదీప్ ఐవోసీ పెట్రోలియం రిఫైనరీ
పారాదీప్ లోని ఐవోసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) పెట్రోలియం రిఫైనరీ పని చేయడం ప్రారంభించింది. ఎన్నో ఒడిదుడుకుల అనంతరం ఈ రిఫైనరీ పెట్రోలు శుద్ధిపనులు చేపట్టింది. దేశంలో అత్యంత గ్రీనరీ రిఫైనరీగా పేరొందిన పారాదీప్ ఐవోసీ రిఫైనరీకి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో రూపకల్పన జరిగింది. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. అది ఇప్పటికి పనులు ప్రారంభించింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంట్ లో బీఎస్-ఐవీ రకం పెట్రోలును శుద్ధి చేయనున్నారు. 15 మిలియన్ టన్నుల రిఫైన్ సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ ప్లాంట్ లో ఇండిమ్యాక్స్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన పెట్రోలును దేశంలోని తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల మార్కెట్ కు తరలిస్తారు.