: అంతరిక్షంలో పూసిన తొలి పూవు 'జిన్నియా ఫ్లవర్'


అంతరిక్షంలో తొలి పూవు పూసింది. భూమిపైన కొన్నేళ్లుగా వందలాది మంది శాస్త్రవేత్తలు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా శాకాహార మొక్కల పెంపకానికి నాసా శ్రీకారం చుట్టింది. ఈ ప్రయోగం ఫలిస్తే ముందుగా కొన్ని రకాల పూల మొక్కలు, తరువాత కూరగాయల మొక్కలు పెంచాలని నాసా భావించింది. జిన్నియా విత్తనాలు మొక్కగా మారి, ఫలించేందుకు ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఎల్ఈడీ లైట్ల కాంతిని ఎరువుగా వినియోగించడం విశేషం. ఇదిప్పుడు పుష్పం కాసింది. ఈ పుష్పాన్ని వ్యోమగామి, శాస్త్రవేత్త స్కాట్ కెల్లీ ఫోటో తీసి ఐఎస్ఎస్ నుంచి భూమికి పంపారు.

  • Loading...

More Telugu News