: భార్యగా, తల్లిగా కరిష్మా విఫలం... అభిషేక్ తోనూ సంబంధాలు: సంజయ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ పై ఆమె భర్త సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనతో పెళ్లికి ముందు ఆమెకు అభిషేక్ బచ్చన్ తో సన్నిహిత సంబంధముందని, ఆయనతో విడిపోయాకే, తనను వివాహం చేసుకుందని కోర్టుకు తెలిపాడు. ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కరిష్మా తనను కేవలం డబ్బు కోసమే వివాహం చేసుకుందని ఫిర్యాదు చేసిన సంజయ్, ఓ కోడలిగా తన తల్లిదండ్రుల ముందు ఆమె విఫలమైందని, తల్లిగా తన పిల్లల ముందు నిలువలేకపోయిందని ఆరోపించాడు. ఇంటిని కూడా గ్లామర్ ప్రపంచంగా మార్చాలని యత్నించిందని, అందువల్లే విడాకులు కోరుతున్నానని అన్నాడు. కాగా, సంజయ్ ఆరోపణలను కరిష్మా తరఫు న్యాయవాదులు ఖండించారు. ఆమెకు ఉన్న గుర్తింపును పాడు చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు.