: నాలుగో వివాహం చేసుకున్న కబీర్ బేడీ


ప్రముఖ నటుడు కబీర్ బేడీ నాలుగో పెళ్లి చేసుకున్నాడు. 70వ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు సన్నిహితుల సమక్షంలో కబీర్ నాలుగో వివాహం చేసుకోవడం విశేషం. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న పర్వీన్ దుసాంజ్ ను వివాహం చేసుకున్నారు. గతంలో ప్రతిమా బేడీ, సుసాన్ హంఫ్రీస్, నిక్కీ బేడీలను వివాహం చేసుకున్న కబీర్ బేడీ విడాకులతో వారితో బంధాన్ని తెంచుకున్నారు. అనంతర క్రమంలో పర్వీన్ దుసాంజ్ (42) తో ప్రేమలో పడ్డారు. పదేళ్ల సహజీవనం అనంతరం వీరు వివాహం చేసుకోవడం విశేషం. పాతతరం బాలీవుడ్ నటుడిగా రాణించిన కబీర్ బేడీ, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.

  • Loading...

More Telugu News