: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'కామసూత్ర 3డి' సందడి
శృంగారతార షెర్లిన్ చోప్రా ప్రస్తుతం 'కామసూత్ర 3డి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ ను 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2013' లో విడుదల చేయనున్నారు. దాంతో పాటు 'కామసూత్ర' కొత్త పోస్టర్ విడుదల, 'హరిశ్చంధ్ర టు కామసూత్ర త్రీడి - వంద సంవత్సరాల భారతీయ సినిమా' పుస్తకం ఆవిష్కరణ, 'సెన్సార్ చేయని కామసూత్ర చిత్రం ప్రత్యేక స్ర్కీనింగ్', 'అంతర్జాతీయ కొనుగోలు దారులకోసం చిత్ర హక్కుల ప్రకటన' వంటి ఐదు కార్యక్రమాల్లో చిత్ర దర్శకుడు రూపేష్ పాల్ తో కలిసి షెర్లిన్ పాల్గొననుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కుతుందని ఈ సెక్సీ సుందరి భావిస్తోంది. మే15 నుంచి కేన్స్ ఫిలిం సంబరాలు మొదలవుతున్నాయి.