: హృతిక్ రోషన్ కు గాయాలు... 'మొహంజోదారో'కు బ్రేక్!
'మొహంజోదారో' చిత్రం షూటింగ్ లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు గాయాలు అయ్యాయి. చిత్రీకరణలో భాగంగా ఓ సన్నివేశం తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. హృతిక్ ఎడమకాలికి గాయం కాగా, వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రెండు వారాల పాటు షూటింగ్ ఆపి హృతిక్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 'మొహంజోదారో'కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.